BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 21 June 2026, 10:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు బంగారం మాయం.. ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 10:39 PM
115 వీక్షణలు

పల్నాడు జిల్లాలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన సుమారు రూ.8 లక్షల విలువైన బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు 2024 జూలైలో 28 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1 లక్ష రుణం తీసుకోగా, అదే ఏడాది నవంబర్‌లో మరో రూ.80 వేలు రుణంగా పొందినట్లు తెలిపాడు. అనంతరం రుణాన్ని చెల్లించి బంగారం తీసుకునేందుకు కంపెనీకి వెళ్లగా అధికారులు కొంత గడువు కావాలని కోరినట్లు పేర్కొన్నాడు.

అయితే, కంపెనీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి, తాకట్టు బంగారాన్ని విక్రయించినట్లు తనకు సమాచారం అందిందని బాధితుడు ఆరోపించాడు. దీంతో సుమారు రూ.8 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు పేర్కొంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు.