BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 27 May 2026, 11:43 am
Posted by : V శ్రీనివాస్

​ఫిట్‌నెస్ లేని విద్యాసంస్థల బస్సులను సీజ్ చేస్తాం: మంచిర్యాల డీటీఓ గోపికృష్ణ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 11:43 AM
134 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో రవాణా అర్హత పత్రం (ఫిట్‌నెస్) లేని విద్యాసంస్థల బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని జప్తు (సీజ్) చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య తనిఖీలను ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన మొత్తం 373 బస్సులు ఉన్నాయని తెలిపారు. అందులో ఇప్పటివరకు 110 బస్సులకు తనిఖీలు పూర్తి చేసి అర్హత పత్రాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

​ప్రతిరోజూ 30 బస్సుల పరిశీలన

​విద్యార్థుల భద్రతే ధ్యేయంగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రతిరోజూ 30 బస్సులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. బడులు తెరిచే లోపు జిల్లాలోని ప్రతి విద్యాసంస్థ తమ వాహనాలకు తప్పనిసరిగా రవాణా శాఖ పరీక్షలు చేయించుకుని, నిబంధనల ప్రకారం అర్హత పత్రం పొందాలని ఆదేశించారు.

​చట్టాన్ని అతిక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి తెచ్చే వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు