BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 11 July 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దస్తావేజులు పెండింగ్లో ఉంచితే చెక్ స్లిప్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 12:40 PM
116 వీక్షణలు

అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైనా దస్తావేజును పెండింగ్‌లో ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా లిఖితపూర్వకంగా చెక్ స్లిప్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెక్ స్లిప్ ఇవ్వకుండా లేదా కార్డ్ 2.0లో నమోదు చేయకుండా అనధికారికంగా దస్తావేజులను పెండింగ్‌లో ఉంచితే దానిని తీవ్రమైన సేవా లోపంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక సంఖ్యలో దస్తావేజులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పెండింగ్ విధానాన్ని రద్దు చేస్తూ, కాలపరిమితితో కూడిన కొత్త విధివిధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన రిజిస్ట్రేషన్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.