BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

PM స్వనిధి పథకంతో స్వయం ఉపాధికి బాటలు.. అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
105 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ప్రధానమంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM స్వనిధి పథకం వీధి వ్యాపారులకు సులభ రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. చిన్న వ్యాపారులు ఆత్మనిర్భరంగా ఎదగడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తెలిపారు.

కూలీ పని చేస్తే ఒక రోజు, ఉద్యోగం చేస్తే ఒక నెల జీవనం సాగుతుందని, అయితే వ్యాపారం చేస్తే జీవితాంతం కుటుంబానికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యాపారం ద్వారా పిల్లల ఉన్నత విద్య, కుటుంబ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. స్వయం ఉపాధి రంగంలోకి వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న రుణాలను అనవసర ఖర్చులకు వినియోగించకుండా ఆదాయాన్ని పెంచే వ్యాపారాల కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమలు వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించి వాటిని క్రమంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ రుణ పథకాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా బలమైన ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. వీధి వ్యాపారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతూ తమ జీవనోపాధిని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.

పథకం అమలులో విశేషంగా కృషి చేస్తున్న అధికారులను అభినందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో మెప్మా అధికారులు, పథకం లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.