BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 24 September 2026, 07:54 pm
Posted by : కూనురు మధు

తెలంగాణలో మళ్లీ విద్యుత్ కష్టాలు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / దామరచర్ల
24 Sep, 2026 - 07:54 PM
75 వీక్షణలు

NTODAY NEWS : నల్గొండ 

దామరచర్ల: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని, 2014కు ముందు నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇళ్లకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని, పరిశ్రమలు జనరేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రైతులు సైతం పంటలను కాపాడుకునేందుకు డీజిల్ జనరేటర్లను వినియోగించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. యాదాద్రి వద్ద నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టేనని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6,700 మెగావాట్ల నుంచి 21,500 మెగావాట్లకు పెంచామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశంతోనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ప్లాంట్‌లో బొగ్గు కొరత ఉందంటూ ప్రభుత్వం చెబుతున్న కారణాలు వాస్తవం కాదని విమర్శించారు. దామరచర్ల ప్రాంతంలోని రైతులకు కనీసం ఆరు గంటల విద్యుత్ కూడా అందడం లేదని అన్నారు. అదే సమయంలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణం జరిగిందని జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను కావాలనే విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిపై అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, జగదీశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు ఇచ్చే వివరణ వెలువడాల్సి ఉంది.