పుంగనూరులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
పుంగనూరులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు:
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు సూచనల మేరకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారిక వర్గాలు కూడా వెల్లడించాయి.
పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీశ్ రాజు, సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, పెద్దమఠం బాబు, రాజా జెట్టి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు ప్యాలెస్ కాంపౌండ్‌లో దీపాలు వెలిగించారు. అనంతరం బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశసేవలో ఆయన మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.