హనీమూన్‌లో విషాదం.. బార్బెక్యూ మంటలు అంటుకుని మహిళకు తీవ్ర గాయాలు
జాతీయం
జాతీయం
డార్జిలింగ్: హనీమూన్ కోసం డార్జిలింగ్ వెళ్లిన ఓ కొత్త జంటకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బార్బెక్యూ వద్ద కూర్చున్న సమయంలో అవతలి వ్యక్తి మంటలపై ద్రవ పదార్థం పోయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ ఘటనలో అక్కడే ఉన్న మహిళకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మహిళ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.