BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 04 January 2026, 09:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త మృతి

తెలంగాణ
04 Jan, 2026 - 09:33 AM
399 వీక్షణలు

ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ముప్పా నరసింహ రెడ్డి మృతి

-నరసింహ రెడ్డికి ప్రముఖుల నివాళి NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ముప్పా నరసింహ రెడ్డి ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన 1941లో చిట్యాల పట్టణంలో జన్మించారు. అంకితభావం, సహనశక్తి, వినయానికి ప్రతిరూపంగా నిలిచిన నరసింహ రెడ్డి విద్యావేత్తగా, భూవిజ్ఞాన శాస్త్రవేత్తగా విశేష గుర్తింపు పొందారు. ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించిన ఆయన, అక్కడే మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. లెక్చరర్‌, రీడర్‌గా పనిచేసి, అనంతరం భూవిజ్ఞాన విభాగంలో ప్రొఫెసర్‌గా (1990–2001) విధులు నిర్వర్తించారు. విభాగాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1989లో నిర్వహించిన 8వ భారతీయ అంతార్కిటికా శాస్త్రయాత్రలో భారతీయ విశ్వవిద్యాలయాల తరఫున ఏకైక ప్రతినిధిగా పాల్గొని విశేష ప్రశంసా పత్రం అందుకున్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఛైర్మన్‌గా, అలాగే ఢిల్లీ ఐఐటీ గవర్నింగ్ బాడీ సభ్యుడిగా సేవలందించి విద్యారంగానికి విశేష గౌరవం తీసుకొచ్చారు. ఆదివారం ఆయన పార్ధివ దేహానికి మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, శాసనమండలి సభ్యుడు చెరుపల్లి సీతారాములు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు ముప్పా నరసింహ రెడ్డి భారతదేశ భూవిజ్ఞాన శాస్త్రానికి అందించిన సేవలు అమూల్యమైనవని, ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. విద్యారంగంతో పాటు మానవత్వం, జ్ఞానం, అంకితభావం వంటి లక్షణాలతో ఆయన లేకపోవడం తీరని లోటుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్‌లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube