BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 26 June 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్ స్పందన.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
79 వీక్షణలు

ఏలూరు, జూన్ 26: జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజస్థాన్‌లోని కోటలో జరిగిన "ఛత్రోంకే గూంజ్" కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు వ్యక్తం చేశారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ, NEET, SSC, APPSC, DSC వంటి పోటీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని, కోటలో జరిగిన ర్యాలీకి యువత భారీగా హాజరుకావడం దీనికి నిదర్శనమని అన్నారు.

రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ, తాళ్లూరి చక్రవర్తి, గౌడు రంగబాబు, చక్కా గుప్తా, పెద్దిరెడ్డి పద్మావతి నాయుడు, దండుబోయిన చంద్రశేఖర్, సాధే బాబుప్రసాద్, సేవాదళ్ సుబ్బారావు, కేఎస్‌ఎన్ మూర్తి, చినబాబు, రాటాలు సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.