BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త
Date of Publish : 20 August 2026, 07:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు.. ఘన నివాళులు

తెలంగాణ
/ తెలంగాణ / ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:59 PM
64 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగం వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోన ధనికుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.