BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 20 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజీవ్ గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయి: కాంగ్రెస్ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
148 వీక్షణలు

తిరువూరు రాజీవ్ భవన్‌లో ఘనంగా 82వ జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు గంజ కృష్ణమోహన్, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వర్గీయ ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ వేసిన పునాదులు దేశ ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, నవోదయ విద్యాసంస్థల ఏర్పాటు వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంస్కరణలు చేపట్టారని, విద్యా రంగంలో సమాన అవకాశాల కల్పనకు కృషి చేశారని తెలిపారు. ఆధునిక భారతావనికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామిశెట్టి శ్రీనివాసరావు, ఇజ్జాడ జగన్నాథం, ఇమ్మనేని శ్రీనివాసరావు, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పర్వతం రామారావు, గంధం శ్రీనివాసరావు, బెంజిమెన్, గరికపాటి నరసింహారావు, అత్తునూరి రంగారెడ్డి, మాధవ్, శివ, కొంగల అందాం తదితరులు పాల్గొన్నారు.