BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 May 2026, 09:06 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 09:06 PM
156 వీక్షణలు

రామచంద్ర యాదవ్  పై కొందరు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాల బండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వెలసిన ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ —

“మా పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్  కానీ, పార్టీ నాయకులు కానీ ఎలాంటి ఇతర రాజకీయ పార్టీలకు తొత్తులు కాదని, బినామీలు కాదని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాము. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య” అని పేర్కొన్నారు.

అలాగే బీసీవై పార్టీకి సవాలు విసిరిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయానికి వచ్చి ప్రమాణం చేయకపోవడం ప్రజలు గమనించారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో టిడిపి, వైసిపి పార్టీలు పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ప్రజలకు స్పష్టంగా తెలుసునని అన్నారు.

బీసీల హక్కులు, యువత భవిష్యత్తు, సామాన్య ప్రజల సమస్యలపై రాజీపడకుండా పోరాడేది బీసీవై పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్, పూల ప్రేమ్ కుమార్ (బీసీవై యూత్ కో-కన్వీనర్), పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ హరిబాబు యాదవ్, సురేష్ యాదవ్, కుమ్మర గిరిబాబు, శివకుమార్, వెంకటేష్ యాదవ్, చలపతి, రెడ్డివారి మోహన్, స్వాతి యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.