BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 July 2026, 10:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్ ఇండియా' గుర్తింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 10:39 PM
113 వీక్షణలు

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్' జాబితాలో ఆమె పేరు నిలిచింది. దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఈ గుర్తింపును అందుకున్నారు.

ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో నారా బ్రాహ్మణి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, సంస్థ అభివృద్ధిలో రైతుల పాత్ర, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే హెరిటేజ్ ఫుడ్స్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబ సభ్యులు, సంస్థ ఉద్యోగులు, పాల ఉత్పత్తిదారులు, రైతులందరికీ అంకితం చేస్తున్నట్లు నారా బ్రాహ్మణి తెలిపారు. సంస్థ అభివృద్ధిలో ప్రతి రైతు భాగస్వామ్యమే ఈ విజయానికి బలమని ఆమె చెప్పారు.

భార్య సాధించిన ఈ ఘనతపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిభను కొనసాగిస్తూ, నాయకత్వ లక్షణాలతో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలిపారు.