BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 24 August 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రామచంద్రపురం: జాతీయ రహదారిపై మోకాలి లోతు గోతులు.. వాహనదారులకు నరకయాతన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 05:45 PM
73 వీక్షణలు

ఏ.కొండూరు మండలం రామచంద్రపురంలో NHAI-30 దుస్థితి

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రపురంలో జాతీయ రహదారి దుస్థితి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. పేరుకే జాతీయ రహదారి అయినప్పటికీ ప్రయాణం మాత్రం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామచంద్రపురం వద్ద NHAI-30పై ఏర్పడిన భారీ గోతులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొద్దిపాటి వర్షానికే గోతుల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. వాహనదారులు గోతులను గుర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో రూ.33 లక్షలతో రహదారి మరమ్మతులు చేపట్టినా, కొన్ని నెలలు గడవకముందే మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. తూతూమంత్రంగా చేపట్టిన పనులతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

రహదారి విస్తరణ పనులు కోర్టు కేసుల కారణంగా కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. రామచంద్రపురం వద్ద సుమారు కిలోమీటరు మేర పనులు పూర్తికాకపోవడంతో ఈ సమస్య కొనసాగుతోంది. నిధులు మంజూరయ్యాయని, సమస్యను పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

గోతుల్లో కార్లు, ఆటోలు దిగబడుతూ తరచూ వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు చెబుతున్నారు. వాహనాల మరమ్మతులకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు.

హైవే నిర్వహణపై NHAI అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నచిన్న మరమ్మతులతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, NHAI అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని రామచంద్రపురం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.