BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 April 2026, 11:33 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 11:33 AM
144 వీక్షణలు
రామసముద్రం మండలం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు. 

​భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త, విద్యావేత్త మరియు ఆర్థిక నిపుణుడు అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని రామసముద్రం మండల దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాదళిత నాయకులు బి. భాస్కర్, అంబరీష్ నరసింహులు, మెకానిక్ వెంకటేష్, వెంకటరమణ, మంజునాథ, సోమశేఖర్, సుబ్రహ్మణ్యం, గంగాధర్, వి. మంజునాథ్, చంద్రప్ప, పరమేష్,రామాంజులు, చలపతి, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అంబేద్కర్ అస్సోసియేషన్ అధ్యక్షలు భాస్కర్ మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలని పిలుపునిచ్చారు.

​ "అంబేద్కర్ అమర్ రహే" అంటూ చేసిన నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.
​ ఎల్లప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ, సమసమాజ స్థాపనకు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.