BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 June 2026, 09:12 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రామసముద్రం పీఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 09:12 PM
91 వీక్షణలు

రామసముద్రం పీఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 

అన్నమయ్య జిల్లా 

మదనపల్లె/రామసముద్రం, జూన్ 04: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని రామసముద్రం పోలీస్ స్టేషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించిన ఆయన, స్థానిక శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీ రవినాయక్, రామసముద్రం ఎస్ఐ శ్రీ రిషికేశవ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడి, ఈ ప్రాంతంలో నేరాల తీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ గారు సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు, నిరంతరం క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.