BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 02 September 2026, 10:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాంపూర్‌హట్‌లో మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 10:32 AM
92 వీక్షణలు

రాంపూర్‌హట్‌: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాంపూర్‌హట్‌లోని తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.

వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. బృష్టి ముఖర్జీ ఘటక్, ఆమె భర్త మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విడాకుల కోసం వారు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ దశలోనే ఉంది.

మరోవైపు బృష్టి కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ వర్గాల నుంచి సమాచారం. అయితే ఆమె మృతికి అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.