BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 23 August 2026, 06:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రావులపాలెం: పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:42 PM
63 వీక్షణలు

రావులపాలెం: పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పెన్షనర్స్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన

రావులపాలెం, ఆగస్టు 23:

విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.

రావులపాలెంలో మండల పెన్షనర్స్‌ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఉద్యోగుల అనుభవం సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెన్షనర్లకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ సంఘం ప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.