BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 07:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయచోటి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 07:38 PM
58 వీక్షణలు

రాయచోటి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతి

రాయచోటి, ఆగస్టు 27:

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యల పరిష్కారం కోసం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యాపక, బోధనేతర సిబ్బంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు.

ఎస్ఎన్ కాలనీలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కళాశాలకు సంబంధించిన పలు సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

కళాశాలలో మౌలిక వసతులు, సిబ్బంది సమస్యలు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలను సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.