BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 August 2026, 03:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేపాక రఘునందన్‌కు గిడుగు సేవా పురస్కారం కవితా రంగంలో 43 ఏళ్ల సేవలకు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 03:16 PM
87 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరుకు చెందిన రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రేపాక రఘునందన్‌కు గిడుగు సేవా పురస్కారం లభించింది.

విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం మల్లెతీగ సాహితీ మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రఘునందన్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

43 సంవత్సరాలుగా కవితా రంగానికి అందించిన విశిష్ట సేవలకు, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను తెలుగు, హిందీ భాషల్లో రచించినందుకు, అలాగే భారతదేశంలోనే తొలిసారిగా పైడిమర్రి ముఖచిత్రంతో తపాలా కవరును విడుదల చేయించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, గిడుగు రామమూర్తి ముని మనవడు గిడుగు వేంకట నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నాటక కళా సమితి వ్యవస్థాపకుడు నన్నపనేని నాగేశ్వరరావు, రచయితలు ఎం. ప్రభాకర్, చిన్ని నారాయణరావు, మల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు కలిమి శ్రీ, గ్రంథాలయాధికారిణి కె. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.