BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 June 2026, 02:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Ration Cards: రేషన్ కార్డుల విభజన సులభతరం చేయాలి.. అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 02:07 PM
117 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

రేషన్ కార్డుల విభజన ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలకు వేగంగా సేవలు అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నెలలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చని పేర్కొన్నారు.

అదేవిధంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అభ్యర్థుల ఆధార్ నంబర్ ఆధారంగా అవసరమైన ధృవీకరణ పత్రాలన్నీ డిజిటల్ విధానంలో స్వయంచాలకంగా ధృవీకరించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.