రైతు బజార్‌లో బీపీటీ బియ్యం ప్రత్యేక విక్రయ కౌంటర్ల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
రైతు బజార్‌లో బీపీటీ బియ్యం ప్రత్యేక విక్రయ కౌంటర్ల ప్రారంభం
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీపీటీ బియ్యం ప్రత్యేక విక్రయ కౌంటర్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.