BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 May 2026, 01:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 01:27 PM
175 వీక్షణలు

రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు!

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల నమోదు, విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం రైతులు ఆర్‌బీకే కేంద్రానికి వస్తున్నప్పటికీ అక్కడ సమాధానం చెప్పేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ప్రభుత్వం రైతులకు అన్ని సేవలు గ్రామ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినా, ఎండపల్లి ఆర్‌బీకేలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉండకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.

వ్యవసాయానికి సంబంధించిన కీలక సమాచారం కోసం వచ్చిన రైతులకు సరైన స్పందన లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆర్‌బీకేలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.