BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 24 August 2026, 05:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 05:52 PM
84 వీక్షణలు

కూటమి ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ డిమాండ్ చేశారు.

డీఎస్సీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ తన కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని, రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" కొనసాగుతోందని విమర్శించారు.

డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు పొందిన వారిని క్రీడాకారిణి పీవీ సింధూతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డీఎస్సీకి హాజరు కాకుండా, క్రీడా విభాగంలో ఎలాంటి శిక్షణ లేకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్నట్లయితే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించేందుకు ఎందుకు వెనుకాడుతోందని రాబర్ట్ ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.