BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 August 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం గ్రంథాలయ మాస్టర్ కొండపల్లి భాస్కరరావుకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 03:51 PM
87 వీక్షణలు


ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రంథాలయ మాస్టర్ కొండపల్లి భాస్కరరావు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భాస్కరరావును, ఆయన సతీమణిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రంథాలయ సేవల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు.

విద్యార్థులు, యువతలో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు జ్ఞాన విస్తరణకు తన సేవా కాలంలో ఎన్నో విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందుబాటులోకి తీసుకువచ్చారని నాయకులు పేర్కొన్నారు.

గ్రంథాలయ అభివృద్ధికి, పాఠకుల సేవకు భాస్కరరావు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగు యువత రెడ్డిగూడెం మండల మాజీ అధ్యక్షులు ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి (పెదబాబు), టీడీపీ సీనియర్ నాయకులు ఉయ్యూరు రామ్మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కొండపల్లి బాబు, గనపిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొని భాస్కరరావుకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.