BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 17 June 2026, 11:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెండు రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 11:39 AM
100 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు త్వరలో శుభవార్త రానుంది.

ఇంటర్మీడియట్ విద్యామండలి సమాచారం ప్రకారం ఈ ఫలితాలు జూన్ 18న విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 12.50 లక్షల జవాబు పత్రాలు పరిశీలించగా, జూన్ 15తో మూల్యాంకనం ముగిసింది. ప్రస్తుతం ఫలితాల ప్రాసెసింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 5 వరకు నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జిల్లా కేంద్రాల్లో జరిగాయి. అన్ని ప్రక్రియలు పూర్తవడంతో నిర్ణయించిన తేదీకే ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు అవకాశం ఇవ్వడంతో దాదాపు 1.50 లక్షల మంది హాజరయ్యారు. మార్కులు మెరుగుపరుచుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం విశేషం.

ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈఏపీసెట్ ర్యాంకులలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఇంటర్ ఫలితాల తర్వాతే వాటిని విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.