BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 25 April 2026, 11:59 pm
Posted by : యామనూరి మల్లికార్జున

రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 11:59 PM
67 వీక్షణలు

రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ .... తక్షణమే తొలగించాలని కమిషనర్‌కు ఆదేశం

నంద్యాల,

నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడలి అయిన శ్రీనివాస్ సెంటర్ సమీపంలో ఉన్న ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న సందు ఆక్రమణకు గురికావడంపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. స్థానికంగా ఉన్న ఈ కీలకమైన సందును కొందరు వ్యక్తులు ఆక్రమించి, మూసివేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన మంత్రి ఫరూక్ శనివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. సందు మూసివేత వల్ల రాకపోకలకు కలుగుతున్న అంతరాయాన్ని పరిశీలించిన ఆయన, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్  నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న గారిని సంఘటన స్థలానికి పిలిపించి మాట్లాడి, సందును ఆక్రమణలను తక్షణమే తొలగించాలి. మూసివేసిన మార్గాన్ని వెంటనే తెరిపించి, సాధారణ ప్రజల ఉపయోగంలోకి తీసుకురావాలిని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, సందులు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సౌకర్యార్థం ఉన్న దారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.