BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 04:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రమణక్కపేటలో ఘనంగా 140వ మేడే వేడుకలు – అమరవీరులకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 04:37 PM
197 వీక్షణలు

రమణక్కపేటలో ఘనంగా 140వ మేడే వేడుకలు – అమరవీరులకు ఘన నివాళులు

రమణక్కపేట (మే 1, 2026): ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో 140వ మేడే వేడుకలు పల్లె పాము భవాని అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు మిఠాయిలు పంచుతూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా వాటికి మద్దతు ఇవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాలు అమలు చేయాలని, పాఠశాలల్లో స్పాట్ కిచెన్ సెంటర్లు రద్దు చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని, కార్మికులకు నెలకు రూ.36 వేల జీతం ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వతీకరణ చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, వి బి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరవీరులు పోరాడి సాధించిన హక్కులు, ఆశయాలను కాపాడుకోవడమే వారికి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని, ఆముదాల సురేషు, ఆముదాల మహేశ్వరరావు, నందిపామరాణి, వేముల మహాలక్ష్మి, వేముల చంటి, ఆముదాల చిన్నబాబు, దార బేబీ శాలిని, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.