వెలిగండ్లలో గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
వెలిగండ్ల
ప్రకాశం జిల్లా, వెలిగండ్ల:
వెలిగండ్ల మండలంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వర్షం, ఈదురుగాలులతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
మల్లెంరాజుపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి రామయ్య పొలంలో మేకలను మేపుతుండగా పిడుగుపడినట్లు సమాచారం. ఈ ఘటనలో రామయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మరోవైపు హుస్సేన్‌పురం గ్రామం సమీపంలో వేపచెట్టు రోడ్డుపై కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టు రహదారిపై పడటంతో కొంతసేపు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఘటన సమయంలో వాహనాలు చెట్టు కింద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.