BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 10 September 2026, 10:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.13 లక్షల విలువైన హషిష్ ఆయిల్ పట్టివేతఆయిల్ పట్టివేత అరకు నుంచి పల్నాడుకు తరలిస్తుండగా పెదపాడు పోలీసులకు చిక్కిన ఇద్దరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 10:49 AM
24 వీక్షణలు

కలపర్రు టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడిన లిక్విడ్ గంజాయి

పెదపాడు: అరకు ప్రాంతం నుంచి పల్నాడు జిల్లాకు ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న లిక్విడ్ గంజాయి హషిష్ ఆయిల్‌ను ఏలూరు జిల్లా పెదపాడు పోలీసులు పట్టుకున్నారు. కలపర్రు టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఈ ఘటనలో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలానికి చెందిన తిరుమల సాయి, వెంకట సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న లీటర్ సామర్థ్యం కలిగిన బాటిల్‌లో లిక్విడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో దానిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న హషిష్ ఆయిల్ విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒక లీటర్ హషిష్ ఆయిల్ సుమారు 14 కిలోల సాధారణ గంజాయికి సమానమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. అరకు నుంచి పల్నాడు జిల్లాకు ఈ మాదకద్రవ్యాన్ని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

నిందితులపై కేసు నమోదు చేసి, లిక్విడ్ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ తనిఖీల్లో పెదవేగి సీఐ రాజశేఖర్, పెదపాడు ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటకుమార్, పోలీసు సిబ్బంది కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.