BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.3,478 కోట్లతో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
90 వీక్షణలు

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు

జమ్మలమడుగు, జూలై 15: వైఎస్ఆర్ కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే మరో భారీ ప్రాజెక్టుకు బుధవారం శ్రీకారం చుట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలో రూ.3,478 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ యూనిట్–2 నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యధు దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి, శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, యువనేత భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దాల్మియా సంస్థ తరఫున గ్రూప్ హెడ్ అనుపమ్ అగర్వాల్, ప్లాంట్ హెడ్ అర్పన్ కుమార్ పరెక్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్ వామన్ రావ్, మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ మనోజ్ శ్రీవాస్తవ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అనంతరం నిర్వహించిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వైఎస్ఆర్ కడప జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.

రూ.3,478 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.