BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 20 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.20 కోట్ల బీమా చెక్కు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
77 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మొగిలి ప్రభు కుమార్ (హెచ్‌సీ 4242) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి యూనియన్ బ్యాంకు అందించే ప్రమాద బీమా నగదు రూ.1.20 కోట్ల చెక్కును అందజేశారు.

2026 ఏప్రిల్ 26న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభు కుమార్ మృతి చెందారు. యూనియన్ బ్యాంకులో ఖాతాలు ఉన్న పోలీసు సిబ్బందికి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో బ్యాంకు ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తోంది.

ఈ మేరకు గురువారం (ఆగస్టు 20) ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో యూనియన్ బ్యాంకు ప్రతినిధులు అందించిన రూ.1.20 కోట్ల బీమా చెక్కును పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ ప్రభు కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ కె.శ్రీధర్ బాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.వి.తిలక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె.శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మేనేజర్ ఉదయ్ కిషన్, ఇబ్రహీంపట్నం శాఖ మేనేజర్ కె.శ్రీరాం, వెల్ఫేర్ ఆర్‌ఐ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సోమయ్య, సంఘ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.