హన్మకొండలో రికార్డు స్థాయిలో లడ్డు వేలం పాట
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ శ్రీనగర్ కాలనీలోని ఓం శ్రీ విఘ్నేశ్వర గజానన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాటకు విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని ‘లంబోదర విల్లాస్’కు చెందిన భారతీయులు దుంపల కుమారస్వామి, బిక్షపతి, రఘుపతి రూ.7,51,116లకు లడ్డూను దక్కించుకున్నారు. సుదూర తీరాల్లో ఉన్నా సంప్రదాయాలపై చూపుతున్న భక్తిశ్రద్ధలను స్థానికులు కొనియాడారు.