BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 02:10 PM
92 వీక్షణలు

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   మహిళల భద్రతే నంద్యాల జిల్లా పోలీస్ శాఖ లక్ష్యం... శక్తి యాప్ కలిగి ఉంటే పోలీసులు మీకు రక్షణగా ఉంటారు.

 - సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 మహిళల భద్రతే నంద్యాల జిల్లా పోలీస్ శాఖ లక్ష్యం... 

శక్తి యాప్ కలిగి ఉంటే పోలీసులు మీకు రక్షణగా ఉన్నట్లే.... 

మహిళలు శక్తివంతంగా ఉన్నపుడే దేశ అభివృద్ధి సాధ్యం....

మహిళల భద్రత, సైబర్ క్రైమ్ నేరాలు, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు సమాజంలో ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ నందు బండిఆత్మకూరు గ్రామంలో అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లు మరియు గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, కొత్త చట్టాలు మరియు ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది.

మహిళలు శక్తివంతంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకోసమే పోలీస్ శాఖ మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కావున ప్రతి ఒక్కరూ మీయొక్క మొబైల్స్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని, శక్తి ఆప్ మీ చెంత ఉంటే పోలీసులు మీ చెంత ఉన్నట్లేనని,మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం గారు మరియు బండిఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ గారు తెలియజేశారు.

విద్యార్థులు, యువత సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. 

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే ఎటువంటి సమాచారాన్ని నమ్మవద్దని,అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, అపరిచిత కాల్స్, మెసేజ్‌లకు స్పందించకూడదని సూచించారు.

మహిళలు, బాలికలపై వేధింపులు, గృహహింస లేదా ఇతర నేరాలు జరిగితే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

ప్రాథమిక దశలో చేసే చిన్న తప్పిదాలు కూడా భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చని ఆయన హెచ్చరించారు. 

మహిళల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని పోలీస్ అధికారులు తెలిపారు. 

పాఠశాలలకు వెళ్లే బాలికలు ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

మహిళల భద్రతలో పోలీస్ శాఖతో పాటు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.