BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 06 August 2026, 08:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సభల్లో కనిపించే జనసందోహం కాదు... పోలింగ్ బూత్‌లో కనిపించే మద్దతే అసలైన బలం: బుడ్డయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 08:42 AM
151 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, నరసాపురం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొట్టేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు (బుడ్డయ్య) యువత పాత్ర, ఎన్నికల రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

గ్రామాల్లో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతను గమనిస్తే నాలుగు వర్గాలుగా కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. సుమారు 25 శాతం మంది గ్రామంలోనే ఉపాధి పొందుతూ జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారని, మరో 25 శాతం మంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్టణాలకు వెళ్తారని తెలిపారు. ఇంకో 25 శాతం మంది పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తూ చదువుకుంటారని చెప్పారు.

మిగిలిన 25 శాతం మందికి మాత్రం స్థిరమైన పని లేకుండా అడ్డాలు, గొడవలు, రాజకీయాల పేరుతో తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా, గ్రామానికి ఇబ్బందిగా మారుతున్నారని విమర్శించారు.

2019 నుంచి 2024 వరకు జరిగిన సభలు, రోడ్‌షోలు, "సిద్ధం" సభల్లో కనిపించిన జనసందోహాన్ని నిజమైన ప్రజా మద్దతుగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. అయితే ఆ హడావుడిని మిగతా యువత నిశ్శబ్దంగా గమనించిందని పేర్కొన్నారు. చదువులు, ఉద్యోగాల కోసం బయట ఉన్న యువత ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి తమ కుటుంబ సభ్యులకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని అవగాహన కల్పించిందని తెలిపారు.

దీని ఫలితంగానే సభల్లో కనిపించిన భారీ జనసందోహం ఓట్లుగా మారలేదని, ఎంతో మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కాయని వ్యాఖ్యానించారు.

పనీపాట లేకుండా హడావుడి చేయడం, బైకులతో విన్యాసాలు చేయడం వల్ల మాస్‌గా కనిపించవచ్చేమో గానీ, వాటితో ఓట్లు రావని బుడ్డయ్య అన్నారు. ఇలాంటి ప్రవర్తనతో ఆలోచించి ఓటు వేసే వర్గాలు మరింత దూరమయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

చివరగా, "సభల్లో కనిపించే మాస్ కాదు... పోలింగ్ బూత్‌లో కనిపించే మద్దతే అసలైన బలం. ఈ తేడాను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది" అని వ్యాఖ్యానించారు.