BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 21 August 2026, 05:41 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

సచివాలయం సాక్షిగా... పనిచేయని మరుగుదొడ్లు!...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Aug, 2026 - 05:41 AM
43 వీక్షణలు

సచివాలయం సాక్షిగా... పనిచేయని మరుగుదొడ్లు!...

అన్నమయ్య జిల్లా.

ప్రజా సమస్యపై అధికారుల నిర్లక్ష్యం — ఉన్నతాధికారులు స్పందించాలి

పరిశీలించిన సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ  వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్

చౌడేపల్లి.

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే పారిశుద్ధ్య సమస్యలు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామపంచాయతీ పరిధిలోని కాటిపేరి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లోని మరుగుదొడ్లు పనిచేయడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఈ సమస్యను సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ పరిశీలించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రజా వసతి నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సచివాలయం సమీపంలోనే మరుగుదొడ్లు పనిచేయని పరిస్థితి నెలకొనడం అధికారుల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.ప్రజల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు,వృద్ధులు,సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రజా వసతులు నిరుపయోగంగా మారకుండా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ను పరిశీలించి,మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు,నిర్వహణ లోపాలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని ఉత్తరాది హరిప్రసాద్ డిమాండ్ చేశారు.