BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 April 2026, 05:38 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన కలెక్టరేట్ ముట్టడి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:38 PM
254 వీక్షణలు

​సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన: కలెక్టరేట్ ముట్టడి

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మందమర్రి ఏరియాలో గత 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులను సింగరేణి యాజమాన్యం కొత్త టెండర్లు పిలవకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల గత రెండు నెలలుగా కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సుమారు వెయ్యి మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడటం దురదృష్టకరమని, తక్షణమే అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, దీనికి సింగరేణి అధికారులతో పాటు మంత్రిగారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్, సంకె రవి, గోమాస ప్రకాష్ మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు