BREAKING
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.
www.ntodaynews.com

రోడ్డుపై గుంతలు మరమ్మత్తు కోరుతూ ధర్నా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:05 PM
203 వీక్షణలు

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రోడ్డుపై గుంతలు మరమ్మత్తు కోరుతూ ధర్నా

ముసునూరు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత కిసాన్ మహాసభ మండల అధ్యక్షులు కామ్రేడ్ పామర్తి రామారావు అధ్యక్షతన, లోపూడి, గుళ్ళపూడి, వలసపల్లి క్రాస్ రోడ్డుపై గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ, "2 మార్చి 2026వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టర్ పి జి ఆర్ ఎస్ లో లోపూడి వరుసపల్లి క్రాస్ రోడ్డుపై గుంటలను వెంటనే పూడ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ అర్జీ దాఖలు చేయడం జరిగిందని" తెలిపారు. సంబంధిత అధికారులు శ్రీమతి బి కృష్ణకుమారి, కార్యనిర్వాహక ఇంజనీరు పి ఆర్ డివిజన్ నూజివీడు వారు, 3.75 మీటర్ల వెడల్పు, 3.77 కిలోమీటర్ల పొడవు ఉన్న రోడ్డుకు కోటి పది లక్షల రూపాయల బిల్లులను ప్రతిపాదించారు. "నిధులు మంజూరు కాగానే వెంటనే పనులు చేపడతాం" అని ఎండార్స్‌మెంట్ ఇచ్చారు.  మంత్రి కొలుసు పార్థసారథి  కూడా స్పందించి, "రోడ్డు మరమ్మత్తుల నిమిత్తము నిధులు మంజూరు చేయించి గుంతలు వెంటనే పూడ్చాలని" కోరారు. నెల రోజుల్లో గుంటలు పూడ్చాలని, కూటమి ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. అనేక గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించి ప్రయాణిస్తున్నారు, కాబట్టి ప్రమాదాలు జరక్కుండా గుంటల వెంటనే పూడిపోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పామర్తి రామారావు, పామర్తి రాజేశ్వరి, పల్లెపాం భవాని, గోళ్ళ కొండయ్య, వేంపాటి సత్యనారాయణ, దూదిగాం వెంకటేశ్వరరావు, గోళ్ళ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.