BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

సివిల్ సప్లయిస్ హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు తక్షణమే చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 09:31 PM
68 వీక్షణలు

సివిల్ సప్లయిస్ హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు తక్షణమే చెల్లించాలి 

ఏఐటీయూసీ డిమాండ్

జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు చేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు మే 27 జరుగుతున్న ఇప్పటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయమని ఏఐటీయూసీ పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణ రెడ్డి, సీపీఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రాంమూర్తి డిమాండ్ చేశారు 

హమాలీలకు ఏప్రిల్ నెల వేతనం తక్షణమే చెల్లించాలని కోరుతూ బుధవారం హమాలీలతో మాట్లాడారు 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి శ్రమిస్తున్న హమాలీలకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ప్రభుత్వం మరియు సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి హమాలీలకు పెండింగ్‌లో ఉన్న ఏప్రిల్ నెల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొదటి వారంలోనే జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, మహిళా గ్రూపులకు చెల్లింపులు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని 

అలాగే ప్రతి నెలా మొదటి వారంలోనే హమాలీలకు జీతాలు చెల్లించే విధంగా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రమాదకర పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న హమాలీలకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకోసం వెంటనే ఈఎస్ఐ పథకం అమలు చేయాలని  డిమాండ్ చేశారు. 

అనారోగ్య పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

అలాగే దశాబ్దాలుగా శ్రమిస్తున్న అర్హులైన హమాలీలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి, ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి, హమాలీల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పళని, రెడ్డప్ప, గంగాధర్, తిరుమల,సదాశివ తదితరులు పాల్గొన్నారు