BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 28 July 2026, 09:12 am
Posted by : V శ్రీనివాస్

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యదర్శిగా తోట శ్రీనివాస్ నియామకం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Jul, 2026 - 09:12 AM
65 వీక్షణలు

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యదర్శిగా తోట శ్రీనివాస్ నియామకం

​సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో, జాతీయ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో శ్రీ తోట శ్రీనివాస్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. సమాచార హక్కు చట్టం-2005 పరిరక్షణ, ప్రజల్లో అవగాహన పెంపు, పారదర్శక పాలన, జవాబుదారీతనం మరియు అవినీతి నిర్మూలన కోసం శ్రీ తోట శ్రీనివాస్ మరింత సమర్థవంతంగా సేవలందిస్తారనే విశ్వాసంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సమాచార హక్కు ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్, రాష్ట్ర కో కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్, అరవింద స్వామి, రాష్ట్ర కార్యదర్శులు రావుల నవీన్ కుమార్, కేడెల ప్రసాద్, మడుపు వేణు గోపాల్ రావ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఏ. శ్రీకాంత్ రెడ్డి, శివ కుమార్ గౌడ్, అశోక్ కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గుడ్డేటి ప్రవీణ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్, నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు మంద సాయి బాబు తదితర జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. "సమాచారమే శక్తి – పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది" నినాదంతో సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు