BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 28 June 2026, 11:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Health: సూరంపాలెం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 11:48 AM
281 వీక్షణలు

ఏలూరు జిల్లా | నూజివీడు నియోజకవర్గం | జూన్ 29 | NTODAY NEWS

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కారాము, మోరంపూడి రమేష్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా కాపాడవచ్చని తెలిపారు.

అధికారులు, వైద్య సిబ్బంది సూచించిన తేదీల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని పేర్కొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగనవాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.