BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 09:41 am
Posted by : K MAHESH

పట్టభద్రుల సమస్యలపై సర్వోత్తమ్ రెడ్డి గళం వినిపిస్తారు

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 09:41 AM
27 వీక్షణలు

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట (ఎన్ టుడే న్యూస్):

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేటలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

దామన్న కుమారుడైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడని మంత్రి పేర్కొన్నారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన పోరాడుతూ వారి గొంతుకగా నిలుస్తారని అన్నారు. ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

సూర్యాపేట అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైల్వే లైన్‌తో పాటు 60 అడుగుల రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు అనుసంధాన రహదారి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.