BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 03 June 2026, 05:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పారిశుధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:36 PM
143 వీక్షణలు

చింతలపూడి మండలం రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు చింతలపూడి మండల కార్యాలయ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఘన వ్యర్థాల నిర్వహణలో మెరుగైన పద్ధతులను అవలంబించడం, విధి నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రథమ చికిత్స వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.

అలాగే భారత ప్రభుత్వ నమస్తే పథకం, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు, ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకాల గురించి వివరించారు. శానిటరీ వర్కర్లకు రూ.1 కోటి, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలియజేస్తూ, వాటి ప్రయోజనాలు మరియు అర్హతలపై పూర్తి సమాచారం అందించారు.

ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అంబటి రాంబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రత్నకుమార్, ట్రైనింగ్ కన్సల్టెంట్ ఎం. నాగేశ్వరరావు (సాహా సంస్థ & వాష్ ఇన్‌స్టిట్యూట్), జిల్లా కోఆర్డినేటర్ జి.ఎస్.ఆర్. రాజు (వాష్ ఇన్‌స్టిట్యూట్) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.