జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఇటిక్యాల: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు “యువతకు పర్యాటక ప్రాముఖ్యత” అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు మంగళవారం నిర్వహించారు.
చిత్రలేఖనంలో విజేతలు
చిత్రలేఖనం విభాగంలో తెలంగాణ మోడల్ స్కూల్, ఇటిక్యాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని డి. మోక్షిత ప్రథమ స్థానం సాధించింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భూపతిపూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎన్. రిషిత ద్వితీయ స్థానం, తెలంగాణ మోడల్ స్కూల్, ఇటిక్యాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం.డి. అల్తమాస్ తృతీయ స్థానం సాధించారు.
వ్యాసరచనలో విజేతలు
వ్యాసరచన విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భూపతిపూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎన్. రిషిత ప్రథమ స్థానం సాధించింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మహితాపూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి పి. కృపాకర్ ద్వితీయ స్థానం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆలూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి తృతీయ స్థానం సాధించారు.
ఉపన్యాసంలో విజేతలు
ఉపన్యాసం విభాగంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, రాయికల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి కె. శ్రీరామ్ ప్రథమ స్థానం సాధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఎం. వెన్నెల ద్వితీయ స్థానం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, రాయికల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి పి. విష్ణు తృతీయ స్థానం సాధించారు.
మూడు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించారు.