BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:06 pm
Posted by : కూనురు మధు

శాకాంబరీ దేవిగా చిట్యాల కనకదుర్గమ్మ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 Aug, 2026 - 08:06 PM
100 వీక్షణలు

శాకాంబరీ దేవిగా చిట్యాల కనకదుర్గమ్మ 

ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

 శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా నల్గొండ జిల్లా  చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవాలయంలో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా  ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీ సమేతంగా పాల్గొన్నారు ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం, గణపతి పూజ, మండపారాధన, గోపూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి వడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రావణమాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఆలయ చైర్మన్, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రధాన అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య యాదవ్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారపు లింగయ్య, జిట్ట సాయిలు, బెలిదే సత్యనారాయణ, ఆలయ అధికారి ఏనుగు నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకులు, భక్తులు, పట్టణ ప్రముఖులు, సేవకులు పాల్గొన్నారు.