BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 17 June 2026, 11:47 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ. 54 లక్షల మోసం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
17 Jun, 2026 - 11:47 AM
102 వీక్షణలు

గుంటూరులో షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఓ హాస్టల్ యజమాని నుంచి రూ.54 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు బ్రాడీపేటకు చెందిన కోటేశ్వరరావు హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద సూపర్వైజర్‌గా పనిచేస్తున్న రామిరెడ్డి, తన స్నేహితుడు గోపీతో కలిసి తమకు షేర్ మార్కెట్‌పై మంచి అనుభవం, అవగాహన ఉందని నమ్మించారు.

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి విడతల వారీగా కోటేశ్వరరావు నుంచి మొత్తం రూ.54 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా లాభాలు ఇవ్వకపోవడంతో పాటు పెట్టిన అసలు పెట్టుబడిని కూడా తిరిగి చెల్లించలేదు.

దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి డబ్బులు ఎలా సేకరించారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.