BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 09:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. రూ.3.36 కోట్ల గోల్డ్ సీజ్!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 09:06 AM
113 వీక్షణలు

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

దర్యాప్తులో, నిందితులు ప్యాంటు నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్‌లలో బంగారాన్ని పేస్ట్ రూపంలో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జూన్ 24న జరిగిన ఈ తనిఖీల్లో బంగారాన్ని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ఇద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

అంతర్జాతీయ మార్గాల ద్వారా బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.