BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 07 August 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామికి శాకాంబరి అలంకరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 02:09 PM
152 వీక్షణలు

శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామికి శాకాంబరి అలంకరణ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని బోటిమీద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం శాకాంబరి అలంకరణను వైభవంగా నిర్వహించారు.

ఆలయ అర్చకుడు వెంకటేశ్వరస్వామి ఆధ్వర్యంలో శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలతో పాటు గర్భాలయంలోని మూలవిరాట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన దండలు, అలంకరణ సామగ్రితో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

శాకాంబరి అలంకరణ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

పెనుగొలను గ్రామంలో చాలా కాలం క్రితమే తొలిసారిగా శాకాంబరి అలంకరణను ఈ ఆలయంలో ప్రారంభించినట్లు ఆలయ కమిటీ కోశాధికారి నాళ్ల రమేష్ తెలిపారు. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆలయంలోని గర్భాలయంలోకి కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు వూటుకూరు నారాయణరావు తెలిపారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం అందుబాటులో ఉండేలా ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.