BREAKING
చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన
www.ntodaynews.com

లక్ష్యసాధన వైపు కృషి చేస్తే విజయం బానిస అవుతుంది

తెలంగాణ
19 Jul, 2025 - 08:43 AM
207 వీక్షణలు
లక్ష్యసాధన వైపు కృషి చేస్తే విజయం బానిస అవుతుంది -- ప్రముఖ దర్శకుడు యాట సత్యనారాయణ NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు రజాకర్ చిత్ర దర్శకుడు గద్దర్ అవార్డు పురస్కార గ్రహీత, యాట సత్యనారాయణను చిట్యాల మండల కేంద్రంలో శనివారం టి.యు.డబ్ల్యూ.జె (ఐ జె యు) చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణంలో శనివారం ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల.బయన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా టియుడబ్ల్యూజె (ఐజేయూ) మండల శాఖ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలవేసి, శాలువా కప్పి జ్ఞాపకను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రజాకార్ చిత్ర దర్శకులు యాడ సత్యనారాయణ మాట్లాడుతూ, తను మారుమూల గ్రామంలో పుట్టిపెరిగి సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి తొలిమెట్టు జర్నలిజమేనని, తనకు బాల్యం నుండి ఎలాంటి ప్రోత్సాహం లేకుండా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తాను ఈ స్థితికి వచ్చానన్నారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో జర్నలిస్టుగా పనిచేశానన్నారు. ఆ వృత్తిలో రాణించి సినీ రంగంలో రాణించాలని ఆలోచన ఆనాడే కలిగిందన్నారు. రజాకార్ సినిమా చిత్రీకరణకు ముందే సినిమా పరిశ్రమలోని ఎంతోమంది తనను బెదిరించినప్పటికీ మొక్కవోని లక్ష్యంతో అప్పటి తెలంగాణ ప్రజల చరిత్ర, జీవన విధానం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తాను రజాకర్ చిత్రాన్ని తీశానన్నారు. తాను తీసిన చిత్రానికి ఇంత ఆదరణ లభించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంచే అవార్డు రావడం తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యం అయిందన్నారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో రాణించాలంటే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యసాధనకు పట్టుదలతో నిరంతరం శ్రమిస్తే విజయం సాధ్యమవుతుందని, విద్యార్థులు కూడా బాల్యం నుండే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకొని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. భవిష్యత్తులో సమాజ శ్రేయస్సు కోసం మరిన్ని ఉత్తమ చిత్రాలు తీసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యదర్శి పెద్ది నరేందర్, మండల అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, గౌరవ సలహాదారుడు మిర్యాల ప్రకాష్, ఉపాధ్యక్షులు ఏళ్ల వెంకన్న, సహాయ కార్యదర్శి కూనూరు మధు, నకిరేకల్ నియోజకవర్గ కమిటీ సభ్యులు జిట్ట మల్లేష్, మండల కమిటీ సభ్యులు అమ రోజు వెంకన్న, మెహర్ బాబు, కాలిన శ్రీశైలం, సినీ దర్శకుడు యాట సత్యనారాయణ బాల్యమిత్రులు పోలిశెట్టి రాజు, తోకల జంగారెడ్డి, చంద్రగిరి శంకర్, గ్యార శేఖర్, నూనె అంజయ్య పాఠశాల డైరెక్టర్లు నర్ర బిక్షం రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది జ్యోతి రెడ్డి, ఎస్కే షమీం, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube