BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 04 March 2026, 09:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండి

తెలంగాణ
04 Mar, 2026 - 09:52 AM
217 వీక్షణలు
ప్రాణాపాయంలో తల్లి.. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.. చికిత్సకు రూ.15 లక్షలు అవసరం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది తిరుమల (భర్త నరేష్) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె మెడ భాగంలోని వెన్నుపూస విరిగిపోవడంతో ప్రస్తుతం కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అదే ప్రమాదంలో ఆమె పెద్ద కుమార్తెకు కూడా చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలిక జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ పరిస్థితి దయనీయం తిరుమల భర్త నరేష్ కూడా ఆరు నెలల క్రితం జరిగిన మరో ప్రమాదంలో కాలు విరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముగ్గురు ఆడపిల్లలున్న ఈ కుటుంబానికి తిరుమలే ప్రధాన ఆదారంగా ఉండేది. ఇప్పుడు ఆమెకు తక్షణం శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్సకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆర్థికంగా బలహీనమైన ఈ కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని భరించే పరిస్థితిలో లేదు. మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయాలనుకునే వారు PhonePe / Google Pay: 7893948403 Account Name: Elkaturi Aruna చిరునామా: గొల్లపల్లి మండల కేంద్రం, జగిత్యాల జిల్లా #HelpNeeded #MedicalEmergency #Jagtial #Gollapalli #SupportPoorFamily #DonateForTreatment #Humanity #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube